తిరుమల 26 అక్టోబర్ : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సెలవులు ముగియడంతో భక్తుల రద్దీ చాలా తగ్గింది. నేడు (గురువారం) శ్రీవారి దర్శనం కోసం 3 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 3 గంటల సమయం పడుతోంది.
ఇక బుధవారం శ్రీవారిని 65,422 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.30 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 23,778 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
