ఆంధ్రప్రదేశ్ 26 అక్టోబర్తె లుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరె్స్టను ఖండిస్తూ టీడీపీ శ్రేణులు చేపట్టిన నిరసన కార్యక్రమాలు 43వ రోజైన బుధవారం కూడా కొనసాగాయి.
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ నిరాహార దీక్ష చేపట్టారు. పుట్టపర్తిలో టీడీపీ కార్యకర్తలు రోడ్లును శుభ్రం చేసి, నిరసన తెలిపారు. విజయవాడలో జలీల్ఖాన్… సైకో పోవాలి అని రాసిన కరపత్రాలను దహనం చేశారు. ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెస్ రాజు చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ సైకిల్ యాత్ర కనిగిరి నియోజకవర్గంలోకి ప్రవేశించింది.
ఈ సందర్భంగా దళితుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, దుర్గా మల్లేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఏలూరు జిల్లావ్యాప్తంగా టీడీపీ శ్రేణులు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ముదినేపల్లిలో చంద్రబాబు విడుదల కోరుతూ పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
