విజయవాడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ) పై దాడి జరగడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఖండించారని.. సీఎంకు కనీసం భద్రత ఇవ్వలేని రాష్ట్ర డీజీపీ ఇంటెలిజెన్స్ ముఖ్య అధికారి ( అసమర్థత బట్టబయలు అయ్యిందని ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి అంకా దినకర్ ( అన్నారు. ఈ సందర్బంగా ఆదివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర డీజీపీ, ఇంటెలిజెన్స్ ముఖ్య అధికారి సమర్థతపైన అనుమానాలున్నాయి.. కాబట్టే ఏపీ బీజేపీ వారిని విధుల నుండి తొలగించమని ఎన్నికల కమిషన్‌ను కోరిందన్నారు.
