సున్నిపెంట :16.ఫిబ్రవరి వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర, చట్టభద్రత, కార్మికులకు సంబంధించిన 44చట్టాలను 4 కోడ్‌లకుగా విభజించడాన్ని నిలిపివేయాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు.
సున్నిపెంటలోని వామపక్షాల ఆధ్వర్యంలో భారత్ బంద్ సందర్భంగా దుకాణాలు, వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఈ సందర్భంగా వామ పక్ష మాట్లాడుతూ కార్మికులకు సంబంధించిన 44చట్టాలను 4 కోడ్‌లకుగా విభజించడాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణను ఆపాలన్నారు. నిరుద్యోగులకు ప్రధాని మోదీ ఇచ్చిన హామీ మేరకు 2 కోట్ల ఉద్యోగాలను కల్పించాలన్నారు. అంతకుముందు పట్టణంలో ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు.
మండల నాయకులు సీపీఐ పార్టీ నాయకులు పులిరాజు, ఓబులయ్య, భవన నిర్మాణ కార్మికుల సంఘం మండల అధ్యక్షుడు అన్వర్‌బాషా, ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు ఆశీర్వాదం, సీఐటీయూ నాయకులు నాగారాజు, మారెన్న, తదితరులు పాల్గొన్నారు.
