తెలంగాణ : 23 ఫిబ్రవరి అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థిని జాహ్నవి మరణానికి కారణమైన పోలీసు కెవిన్ డవేపై నేరాభియోగాలు మోపడం లేదని అక్కడి అధికారులు వెల్లడించారు.
ఈ కేసులో సరైన సాక్ష్యాధారాలు లేకపోవడమే అందుకు కారణమని కింగ్ కౌంటీ ప్రాసిక్యూటింగ్ కార్యాలయం బుధవారం ప్రకటించింది. సమగ్ర విచారణ జరిపిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది. జాహ్నవి మృతిని తక్కువ చేస్తూ చులకనగా మాట్లాడిన మరో పోలీసు అధికారి డేనియల్ అడెరెర్ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ లేడని కింగ్ కౌంటీ ప్రాసిక్యూటింగ్ అటార్నీ లీసా మానియన్ తెలిపారు.
అయితే అడెరెర్ వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోద యోగ్యం కాదని స్పష్టం చేశారు. ప్రజలకు పోలీసులపై విశ్వాసం తగ్గించేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పారు. ఇప్పటికే అతడిపై సస్పెన్షన్ వేటు పడింది. అతడిపై చర్యల తుది విచారణ మార్చి 4న జరగనుంది.
