ఢిల్లీ : 21ఫిబ్రవరి చంద్రయాన్-3, మిషన్ ఆదిత్య ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించి సరికొత్త చరిత్ర సృష్టించింది భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో ప్రయోగానికి మిషన్‌కు సన్నద్ధమవుతున్నది. ప్రస్తుతం గగన్‌యాన్ మిషన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ మిషన్‌లో తొలిసారిగా అంతరిక్షయాత్ర చేపట్టనుండగా.. ఈ కీలకమైన ప్రాజెక్టులో ఇస్రో మరో ముందడుగు వేసింది. మిషన్ కోసం ఎల్‌వీఎం-3 లాంచ్ వెహికిల్ క్రయోజనిక్ ఇంజిన్‌ను ఇస్రో వాడనున్నది. సీఈ20 క్రయోజనిక్ ఇంజిన్ గగన్‌యాన్ మిషన్‌కు సిద్ధంగా ఉందని ఇస్రో తెలిపింది.
