కోల్‌కతా16 ఫిబ్రవరి ప్రముఖ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మిమి చక్రవర్తి గురువారం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షురాలు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి బుధవారం రోజునే అందజేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ఆమోదం తెలిపిన తర్వాత లోక్‌సభ స్పీకర్‌కు రాజీనామాను సమర్పిస్తానని వెల్లడించారు.
రాజకీయాలకు సరిపోనని ఇన్నేళ్లకు తనకు అర్థమైందని తెలిపారు. 2019 ఎన్నికల్లో జాదవ్‌పుర్ లోక్‌సభ స్థానం నుంచి ఆమె ఎన్నికయ్యారు.
