దిల్లీ:,16, ఫిబ్రవరి సార్వత్రిక ఎన్నికల వేళ.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్కు ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ అకౌంట్లు ఫ్రీజ్ అయినట్లు సమాచారం. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత, పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్ శుక్రవారం మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. గురువారమే పార్టీకి చెందిన వివిధ విభాగాలకు చెందిన బ్యాంకు అకౌంట్లన్నీ ఫ్రీజ్ అయినట్లు ఆయన చెబుతున్నారు.
