తెలంగాణ : హైదరాబాద్ : జనవరి 23( హింస)
కొడంగల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. రైతుబంధు రాలేదని నిలదీసినందుకు, రుణమాఫీపై ప్రశ్నించినందుకు రైతు కోస్గి బాల్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు బొమ్రాస్‌పేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాల్ రెడ్డిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాల్ రెడ్డి స్వస్థలం కొడంగల్ నియోజకవర్గంలోని కొత్తూరు గ్రామం.
పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార
