ఆంధ్రప్రదేశ్17 జనవరి (హిం.స)మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఒకప్పుడు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కాంగ్రెస్ నేతగా, మంత్రిగా శాసించిన నేత. గవర సామాజిక వర్గానికి చెందిన కొణతాల.. నాలుగు దశాబ్ధాలుగా రాజకీయాల్లో వున్నారు. 1989లో తొలిసారిగా కాంగ్రెస్ తరపున అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 2009లో ఓటమి పాలైనప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి రావడంతో కొణతాల హవా నడిచింది. అనంతరం రాష్ట్ర విభజనతో కొణతాల రామకృష్ణ కాంగ్రెస్‌ను వీడి వైసీపీలో చేరారు. 2014లో వైసీపీ ఓటమి పాలవ్వడం, విశాఖ ఎంపీగా విజయమ్మ ఓడిపోవడంతో కొణతాలకు పార్టీ హైకమాండ్‌తో గ్యాప్ వచ్చినట్లు వార్తలు వినిపించాయి. అనంతరం ఆయన పూర్తిగా సైలెంట్ అయిపోయారు. అనంతరం ఆయన టీడీపీలో చేరతారని ఊహాగానాలు వినిపించాయి. ఆయన రాజకీయాలుకు దూరంగా ఉన్నప్పటికీ రైతు సమస్యలు, చెరకు సాగులు ఇబ్బందులు, షుగర్ ఫ్యాక్టరీలు మూతపడటం వంటి వాటిపై కొణతాల రామకృష్ణ పోరాటం చేస్తూ వచ్చారు. ఆయన ఇటీవల యాక్టివ్ పాలిటిక్స్ వైపు కొణతాల దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. ఆయన జనసేనలో చేరతారని ప్రచారం జరుగుతోంది. పవన్‌తో భేటీ కావడంతో ఆయన జనసేనలో చేరతారని ఖరారైంది
హిందూస్తాన్ సమాచార, రాజీవ్.
