



శ్రీకాకుళం అర్బన్, 18 జనవరి (హిం.స): శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్ర’ పోటీల్లో కొట్లాట జరిగింది. శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో బుధవారం మండల స్థాయి కబడ్డీ పోటీలో భాగంగా పెద్దపాడు, రిమ్స్ రోడ్డు జట్లు తలపడ్డాయి.
ఆటలో భాగంగా రిమ్స్ రోడ్డు క్రీడాకారులు కూతకు వెళ్లిన పెద్దపాడు ఆటగాడిని కోర్టు బయటకు నెట్టారు. దీంతో పెద్దపాడు గ్రామానికి చెందిన ప్రేక్షకులు ఒక్కసారిగా రిమ్స్ రోడ్డు క్రీడాకారులపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. వెంటనే రిఫరీలు ఆటను నిలిపివేశారు. కమిషనర్ జోక్యం చేసుకుని.. పోలీసుల పర్యవేక్షణ మధ్య పోటీని పూర్తి చేశారు. రిమ్స్ రోడ్డు జట్టు విజయం సాధించినట్లు ప్రకటించారు.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
