తెలంగాణ : హైదరాబాద్ : డిసెంబర్30( హింస)
కొత్త రేషన్ కార్డుల కోసం ప్రత్యేక ఫారమ్ ను అధికారులు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన రేషన్ కార్డు దరఖాస్తు కొరకు కుటుంబ వివరాలు జత చేయాలి కొత్త రేషన్ కార్డును అందుబాటులోకి తెచ్చింది. ఇందులో కొత్త కార్డులతో పాటు పిల్లల పేర్లను నమోదు చేసుకోవడానికి వీలుగా వివరాలు ఉన్నాయి. కొత్త రేషన్ కార్డులతో పాటు ఇప్పటి వరకు పిల్లల పేర్లను నమోదు చేయలేని తల్లిదండ్రులు వారి పేర్లను సైతం జత పరిచేందుకు కొత్త రేషన్ కార్డుల కోసం ప్రత్యేక దరఖాస్తు ఫారమ్ అందుబాటులోకి తీసుకు వచ్చింది సర్కార్. అయితే ఈ దరఖాస్తు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొత్త దరఖాస్తు ఫారమ్ లో దరఖాస్తు దారు ఇంటి యజమాని పేరు, కుటుంబం మొత్తం కలిపి దిగిన ఫోటో, కులము, పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్, కుటుంబ సభ్యుల వివరాలు కిందనే బాక్స్ రూపంలో ఇచ్చారు. అందులో తల్లిదండ్రుల పేర్లతో సహా పిల్లలు ఎంతమంది ఉన్నారనే వారి పేర్లతో సహా ఆధార్ కార్డు నెంబర్ తో సహా వివరించాల్సి వుంటుంది.
పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార
