,ఢిల్లీ,29,,డిసెంబర్ (హిం.స) రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి భాజపా అగ్రనేత ఎల్కే ఆడ్వాణీని సాదరంగా తీసుకొచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేయాలంటూ ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు భాజపా మాజీ ఎంపీ, రామమందిర ఉద్యమ నేత రాం విలాస్ వేదాంతి గురువారం విజ్ఞప్తి చేశారు. ‘‘రామ మందిరంలో రామ్ లల్లా (బాల రాముడు) విగ్రహ ప్రతిష్ఠను ఆడ్వాణీ స్వయంగా ఆయన కన్నులతో చూసి తరించాలి. ఇది దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల కోరిక. ఎందుకంటే రామమందిర ఉద్యమంలో ఆడ్వాణీ పోషించిన పాత్ర మహోన్నతమైనది’’అని వేదాంతి పేర్కొన్నారు. దేశ రాజకీయాల్లో ప్రస్తుత కీలకదశకు భాజపా చేరుకోవడంలో వాజ్పేయి, ఆడ్వాణీ, మురళీ మనోహర్ జోషిల కృషి ఎంతో ఉందని ఆయన వెల్లడించా
హిందుస్థాన్ సమాచార,నాగరాజ్
