ఉరవకొండ, 23 జనవరి (హిం.స)
సీఎం జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఉరవకొండలో పర్యటించనున్నారు. దీంతో వామపక్ష, స్టూడెంట్ యూనియన్ నాయకులకు ముందస్తు నోటీసులు సోమవారం అర్ధరాత్రి అందించారు. నిరుద్యోగుల సమస్యల పట్ల సీఎం పర్యటనను అడ్డుకుంటామని స్టూడెంట్ యూనియన్ నాయకులు పేర్కొనడంతో పోలీసులు వారికి నోటీసులు అందించారు. దీంతో పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఏఐఎస్ఎఫ్, ఎస్ ఎఫ్ ఐ, ఎస్ ఎఫ్ ఐ నాయకులు పోలీసుల నుండి నోటీసులు అందుకున్నారు.
హిందూస్తాన్ సమాచార్,సంధ్యా
