దిల్లీ,23,జనవరి (హిం.స) అయోధ్యలోని నూతన రామమందిరంలో జరిగిన ప్రాణ ప్రతిష్ఠ వేడుక అనేక రికార్డులను బద్దలు కొట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ ఛానల్ ఈ రికార్డులలో అగ్రస్థానంలో నిలిచింది. లైవ్ స్ట్రీమ్ సమయంలో ప్రపంచంలోనే అత్యధిక వీక్షణలు అందుకున్న యూట్యూబ్ ఛానల్గా నరేంద్ర మోదీ ఛానల్ నిలిచింది.
రామ మందిరంలో జరిగిన ప్రాణ ప్రతిష్ఠ వేడుకను నరేంద్ర మోదీ ఛానెల్లో ప్రత్యక్ష ప్రసారం చేయగా తొమ్మిది మిలియన్ల మంది అంటే 90 లక్షల మందికి పైగా జనం ప్రత్యక్షంగా వీక్షించారు. అన్ని యూట్యూబ్ ఛానళ్ల లైవ్ స్ట్రీమ్ వీక్షణలలో ఇదే అత్యధిక రికార్డ్గా నిలిచింది.
హిందూస్తాన్ సమాచార్ /నాగరాజ్
