అమరావతి, 18 జూలై (హి.స.): వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సిట్ అధికారులు షాక్ ఇచ్చారు. ఆయనను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో వారెంట్ కోరుతూ విజయవాడ కోర్టులో () పిటిషన్ వేశారు. మిథున్ రెడ్డి వైసీపీ ఎంపీ) కావడంతో ఆయన తలదాచుకున్న ప్రాంతాల్లో సోదాలు, అరెస్ట్ చేసేందుకు చట్ట ప్రకారం ముందుకు వెళ్తున్నారు సిట్ అధికారులు. కాగా మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి వేసిన ముందస్తు బెయిల్ పిటీషన్ ను హైకోర్టు ( డిస్మిస్ చేసిన సంగతి తెలిసిందే.
—————
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ
