తెలంగాణ : హైదరాబాద్ : డిసెంబర్25( హింస)
వీధి కుక్కలు మరో చిన్నారి ప్రాణాలను బలి తీసుకున్నాయి. హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో నాలుగేళ్ల బాలుడు, ఖమ్మంలోని రఘునాథపాలెం మండలంలో 5 ఏళ్ల చిన్నారి కుక్కల దాడిలో మృతి చెందిన ఘటనలు ఇంకా మన కళ్ల ముందు మెదలాడుతుండగానే.. తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని షేక్‌పేటలో వీధి కుక్కల దాడిలో 5 నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి.. 17 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆ చిన్నారి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.
పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార
