





కృష్ణా: 8 జనవరి (హిం.స)గన్నవరం తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ యార్లగడ్డ వెంకట్రావు దంపతులు ఆధ్వర్యంలో సోమవారం నాడు శత చండీయాగాన్ని ప్రారంభించారు.
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని శతచండీయాగం నిర్వహిస్తున్నట్లు యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. 30 మంది వేద పండితులతో మూడు రోజులు పాటు యాగం జరగనున్నది.
ఇందుకోసం ఏర్పాట్లు చేశామని చెప్పారు. చంద్రబాబుకు దేవుడు ఆశీస్సులు కావాలని యాగం చేస్తున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమన్నారు. సస్యశ్యామలమైన గన్నవారానికి పూర్వవైభోగం రావాలని తెలుగుదేశం పార్టీ విజయం సాధించాలని యాగం చేపట్టామని యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
