తెలంగాణ : హైదరాబాద్ : జనవరి 17( హింస)
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితిపై ఏఐజీ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. తమ్మినేని వీరభరం గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారని వైద్యులు వివరించారు. అయితే ఊపిరితిత్తుల్లోని నీటిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నామని వైద్యులు వెల్లడించారు. తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. నిన్నటితో పోలిస్తే బీపీ లెవెల్స్ నార్మల్ కి చేరుకుంటున్నాయన్నారు. లంగ్స్ లో నీరునీ వైద్యులు తొలగిస్తున్నట్లు వెల్లడించారు.
పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార
