తిరుమల, 12 అక్టోబర్ (హి.స.)కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. ఈ క్రమంలో తిరుమలలో భక్తుల రద్దీ మరోసారి పెరిగింది. నేడు(ఆదివారం) శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. వారాంతం కావడంతో భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయి శిలాతోరణం వరకు క్యూలైన్ లో వేచి ఉన్నారు. క్యూలైన్‌లోని భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా అన్నప్రసాదం, పాలు, తాగునీరు అందిస్తున్నారు. నిన్న(శనివారం) శ్రీవారిని 84,571 మంది భక్తులు దర్శించుకున్నారు. 36,711 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం(Hundi Income) రూ.3.70 కోట్లు వచ్చిందని టీటీడీ(TTD) అధికారులు తెలిపారు.
—————
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV
