









ఆంధ్రప్రదేశ్ /21 జనవరి (హిం.స)ఏపీలో అధికార వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి..తాజాగా వైఎస్ షర్మిల సమక్షంలో విజయవాడలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ కండువా కప్పి వైఎస్ షర్మిల సాదరంగా ఆయనను ఆహ్వానించారు. తనతోపాటు శెట్టి గంగాధర్, మరి కొంతమంది వైసీపీ శ్రేణులు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ క్రమంలో త్వరలోనే రాష్ట్ర కాంగ్రెస్లోకి భారీగా చేరికలు ఉంటాయని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. దీంతో ఏపీ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది.
హిందూస్తాన్ సమాచార రాజీవ్
