






విజయనగరం జిల్లా07 జనవరి (హిం.స) ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ‘గో బ్యాక్’ అంటూ వైసీపీ శ్రేణులు నినాదాలు చేశారు. ఎమ్మెల్యే కడుబండికి మళ్లీ టిక్కెట్టు ఇస్తే ఓడిపోతామని పేర్కొంటూ నాలుగు మండలాల నుంచి జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు అధిష్టానాన్ని కలిసేందుకు ప్రత్యేక బస్సుల్లో విజయవాడకు పయనమయ్యారు.
కాగా శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు మరోసారి టిక్కెట్ ఇవ్వొద్దంటూ కొత్తవలస మండలానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డికి విన్నవించారు. విశాఖ ఎయిర్‌పోర్టులో ఈనెల 4న అతన్ని కలిసి వేరెవరికైనా టిక్కెట్ ఇవ్వాలని కోరారు.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
