



అనంతపురం: 17 జనవరి (హిం.స)జిల్లాలో ఏడుగురు తహసీల్‌దార్లను అధికారులు బదిలీ చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి జోన్ -4 పరిధిలోని ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. జోన్ -4 పరిధిలోని ఇతర జిల్లాల నుంచి ఉమ్మడి అనంతపురం జిల్లాకు తహసీల్‌దార్లు రానున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కలెక్టరేట్ ఆర్డీవో కార్యాలయాల్లో పనిచేస్తున్న తహసీల్‌దార్లు అలెగ్జాండర్, పుణ్యవతి, బాలాజీ రాజు, గుంతకల్లు డీఏవో భూషణం బదిలీ అయ్యారు. సత్య సాయి జిల్లా కలెక్టరేట్‌లోని ఏ.శ్రీనివాసులు, టి.ఆనంద్ కుమార్, ఖత్రీన్ జు కృఫా.. సాధారణ ఎన్నికల దృష్ట్యా రెవెన్యూలో బదిలీలు మొదలయ్యాయి.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
