యడ్లపాడు,29 మార్చ్వై సీపీ నేత బావమరిది నకిలీ కరెన్సీ నోట్లతో ప్రభుత్వ మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేయబోయి అక్కడి సిబ్బందికి దొరికిపోయాడు.
ఈ విషయంలో నిందితుడిని పోలీసులు కాపాడే యత్నం చేస్తున్నారు. పల్నాడు జిల్లా యడ్లపాడు ప్రభుత్వ మద్యం దుకాణానికి బుధవారం గుర్తు తెలియని వ్యక్తి వచ్చి నకిలీ రూ.500 నోటుతో మద్యం కొన్నాడు.
బుధవారం నాటి నగదును గురువారం బ్యాంకులో జమ చేస్తుండగా అధికారులు నకిలీ నోటు గుర్తించి, దుకాణ సిబ్బందిని అప్రమత్తం చేశారు. దీంతో దుకాణ సిబ్బంది నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే గురువారం యడ్లపాడు మండలం కారుచోలకు చెందిన వైకాపా నేత బావమరిది షేక్ ఖాజా దుకాణానికి వచ్చి రూ.500 నోటు ఇచ్చాడు. సిబ్బంది అది నకిలీ నోటుగా గుర్తించి, వెంటనే ఖాజాను పట్టుకున్నారు. అతడి జేబులు సోదా చేసి, ఏడు నకిలీ రూ.500 నోట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పోలీసులకు అప్పగించారు.
