వేపగుంట, 20 ఏప్రిల్జ గనన్న ఎక్కడికి వస్తున్నా ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. కాకినాడలోని సిద్ధం సభకు ఆర్టీసీ బస్సులు శుక్రవారం తరలిపోయాయి. దీంతో ప్రయాణికులు అష్టకష్టాలు పడ్డారు. సింహాచలం ఆర్టీసీ డిపోలో బస్సుల సంఖ్యే చాలా తక్కువ. అందులోని కొన్ని సిద్ధం సభకు తరలిపోయాయి. ఫలితంగా నగరం నుంచి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధానంగా చోడవరం, మాడుగుల, కోటపాటు, కోడూరు వంటి శివారు ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు ఇక్కడే రాత్రి వరకు ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా సింహాచలం అప్పన్నస్వామి కల్యాణోత్సవం రోజున బస్సులు లేకపోవడంతో భక్తులకు బస్సుల సౌకర్యం కల్పించడంలో ఆర్టీసీ అధికారులు ఇబ్బందులు పడ్డారు.
