విశాఖపట్నం(ఆంధ్రప్రదేశ్), ఏప్రిల్ప్ర తిభను గుర్తించి, ప్రోత్సహించడం వర్సిటీ విధానమని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. నగరానికి చెందిన కళాకారుడు మోకా విజయ్ కుమార్ని శుక్రవారం సత్కరించారు. ఏయూ అంబేద్కర్ చైర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మిల్లెట్స్తో తయారు చేసిన అంబేద్కర్ చిత్రపటాన్ని విజయ్ కుమార్ వీసీ ఆచార్య ప్రసాద రెడ్డికి, అంబేద్కర్ చైర్ ప్రొఫెసర్ ఆచార్య ఎం.జేమ్స్ స్టీఫెన్లకు బహూకరించారు
. వర్సిటీ తరపున సత్కరించి, జ్ఞాపికను బహూకరించారు. ఏయూ పూర్వ విద్యార్థి, వయాట్రిస్ సంస్థ క్వాలిటీ ఇన్వెస్టిగేషన్స్, సర్వేలెన్స్ రెగ్యులేటరీ కమ్యూనికేషన్ హెడ్ డాక్టర్ దేవ పురాణం మాట్లాడుతూ ఇటువంటి ప్రత్యేకమైన కళారూపాలను తయారు చేయడం ఎంతో సంక్లిష్టమైన అంశమన్నారు. ఏయూ ఇటువంటి కళలకు అందిస్తున్న ప్రోత్సాహం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా చిత్రకారుడు మోకా విజయ్ కుమార్ని అభినందించారు.
