రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వుల మేరకు, అనకాపల్లి జిల్లా ఎస్పీ కె.వి.మురళీకృష్ణ అనకాపల్లి మండలం శంకరం గ్రామంలో కలెక్టరేట్ వద్దగల ఫ్యూచర్ వరల్డ్ పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్స్ చుట్టుపక్కల 2 కిలోమీటర్ల మేరను రెడ్ జోన్ గా ప్రకటించారు. ఈ ప్రకటనతో అనధికార డ్రోన్ కార్యకలాపాలను నిషేధించారు.
BulletsIn
- రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వుల మేరకు నిర్ణయం.
- అనకాపల్లి జిల్లా ఎస్పీ కె.వి.మురళీకృష్ణ ప్రకటించిన రెడ్ జోన్.
- అనకాపల్లి మండలం, శంకరం గ్రామం, కలెక్టరేట్ వద్ద గల ఫ్యూచర్ వరల్డ్ పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్స్ చుట్టుపక్కల 2 కిలోమీటర్ల మేర రెడ్ జోన్.
- ఈ ప్రకటన ద్వారా గగనతలంలో 2 కిలోమీటర్ల మేర అనధికార డ్రోన్ కార్యకలాపాలను నిషేధం.
- జిల్లా ఎస్పీ పోలీసు అధికారులకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశం.
- రెడ్ జోన్ నిబంధనలు వెంటనే అమలులోకి వస్తాయని స్పష్టం.
- కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేంతవరకు రెడ్ జోన్ నిబంధనలు అమలులో ఉంటాయని ప్రకటించారు.
- నిబంధనలు అతిక్రమిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక.
- రెడ్ జోన్ నిబంధనలు సక్రమంగా అమలు చేయడంపై జిల్లా పోలీసులు దృష్టి సారించాలి.
- ఈవీఎం స్ట్రాంగ్ రూమ్స్ భద్రతను కట్టుదిట్టం చేయడానికి ఈ చర్యలు చేపట్టడం.
