తెలంగాణ: హైదరాబాద్;
మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే
రంజాన్ పండుగ వేడుకలు భాగ్యనగరంలో ఘనంగా జరుగుతున్నాయి. రంజాన్ను పురస్కరించుకుని చార్మినార్ మక్కా మసీదు వద్ద ముస్లిం సోదరులు ప్రార్ధనల్లో పాల్గొన్నారు. పండుగ నేపథ్యంలో ఎలాంట ఆటంకాలు జరుగకుండా చార్మినార్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. చార్మినార్ వద్ద 200 మంది లా అండ్ ఆర్డర్, టాస్క్ ఫోర్స్ పోలీసులు భద్రతా విధుల్లో ఉన్నారు. ప్రశాంత వాతావరణంలో పండుగ వేడుకలు జరుగుతున్నట్లు సమాచారం.
