విశాఖపట్నం విజయవాడ ( సింగ్నగర్లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై ) జరిగిన గులకరాయి ఘటనపై జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ) స్పందిస్తూ ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కోడి కత్తి డ్రామాతో జగన్ అధికారంలోకి వచ్చారని.. ఇప్పుడు సింగ్ నగర్లో గులకరాయి దాడితో కొత్తనాటకానికి తెరలేపారంటూ విమర్శించారు. జగన్ పర్యటించిన ప్రదేశంలో వీధిలైట్లు కూడా లేనప్పుడు నిఘావర్గాలు ఏమి చేస్తున్నట్లు అని ప్రశ్నించారు. ఒక్క జగన్కే చీకట్లో గులకరాయి ఎలా తగిలింది? అంటూ ఎద్దేవా చేశారు. దీనికి బాధ్యత వహించి డీజీపీ తక్షణమే విధుల్లోంచి తప్పుకోవాలన్నారు.
