కర్నూలు జిల్లా: 25అక్టోబర్ దేవరగట్టులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బన్నీ ఉత్సవంలో మాల మల్లేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను దక్కించుకునేందుకు భక్తులు రెండు వర్గాలుగా విడిపోయారు.
విగ్రహాల కోసం రింగులు తొడిగిన కర్రలతో కొట్టుకున్నారు. ఈ ఘటనల పలువురి భక్తుల తలలు పగిలాయి. కొంతమంది అయితే దివిటీలను గాలిలోకి ఎగుర వేశారు. పలువురికి గాయాలయ్యాయి.
కాగా దేవరగట్టు బన్నీ ఉత్సవాలలో అపశృతి చోటు చేసుకుంది. సింహాసనం కట్ట వద్ద ఉన్న వేప చెట్టుపైకి కొందరు భక్తులు ఎక్కారు. దీంతో బరువు ఎక్కువకావడంతో చెట్టు కొమ్మ విరిగి పలువురు భక్తులు కిందపడిపోయారు. ఈ ఘటనలో గణేష్ అనే యువకుడు మృతి చెందగా, పలువురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
