తెలంగాణ : హైదరాబాద్ :
ఇంటర్ పరీక్షల్లో నిమిషం ఆలస్యమైతే పరీక్ష రాయనివ్వమనే నిబంధన విద్యార్థుల పాలిట శాపంగా మారింది. నల్లగొండ జిల్లాలో పరీక్షకు ఆలస్యంగా వచ్చారని జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఐదుగురు విద్యార్థులను అధికారులు పరీక్షకు అనుమతించలేదు. దీంతో విద్యార్థులు విషాదంతో వెనుదిరిగారు. నిమిషం నిబంధన వల్ల తమ జీవితాల్ని కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
