తెలంగాణ : హైదరాబాద్
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు లేఖ రాశారు. కమ్మవారి సంక్షేమం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ‘‘సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన అన్ని కులాల సంక్షేమం కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలన్న మీ నిర్ణయం అభినందనీయం. కమ్మవారు చట్టపరంగా అగ్రవర్ణమే అయినా.. ఆ కులంలో మెజారిటీ ప్రజలు పేదరికంలో మగ్గిపోతున్నారు. పిల్లల ఫీజులు కట్టలేక మెరిట్ ఉన్నా ఆర్థిక ఇబ్బందులతో మధ్యలోనే చదువులు ఆపేస్తున్న పరిస్థితి ఉంది అని అన్నారు.
