విశాఖపట్నం : 17 ఫిబ్రవరి వచ్చే ఎన్నికల్లో్ గెలుపే లక్ష్యంగా వైవీ సుబ్బారెడ్డితో కలిసి ప్రణాళికలు వేస్తున్నామని.. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియను మొదలు పెట్టామని మంత్రి సిదిరి అప్పలరాజు వ్యాఖ్యానించారు. ఈ సందర్బంగా శనివారం మంత్రి విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. అందరి లక్ష్యం రానున్న ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలన్నదేనని అన్నారు. మొన్న జరిగిన సిద్ధం సభ నుంచి ప్రతిపక్షాలు డైలమాలో ఉన్నాయన్నారు. ఇంకా ప్రతిపక్షాలు వాళ్ల ఉమ్మడి జాబితాను విడుదల చేయలేని స్థితిలో ఉన్నాయని విమర్శించారు. గతం కన్నా మెరుగ్గా అత్యధిక సీట్లతో గెలిపించుకోవడం తమ లక్ష్యమని సిదిరి అప్పలరాజు పేర్కొన్నారు.
