తెలంగాణ : హైదరాబాద్ : 12ఫిబ్రవరి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో ఓ కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కలకలం రేపింది. కాగా..వణ్య ప్రాణాల కోసం ఏర్పాటు చేసిన కరెంట్ వైర్లు తగిలి విధి నిర్వహణలో ఉండగానే కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కాటారం మండల పరిధిలోని నస్తూర్పల్లిలో చోటుచేసుకుంది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఏం జరిగిందో తెలుసుకోవాలని పై అధికారులకు విచారణ ఆదేశించారు. కరెంట్ తీగలు ఎవరు అమర్చారో తెలుసుకునే పనిలో దర్యాప్తు చేస్తున్నారు.
