రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశం సీఎం చంద్రబాబునాయుడి అధ్యక్షతన గురువారం ఉదయం 11 గంటలకు అమరావతిలో జరుగుతుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
BulletsIn
-
CM చంద్రబాబునాయుడి అధ్యక్షతన క్యాబినెట్ భేటీ.
-
ప్రధాని మోడీకి అమరావతి రీస్టార్ట్ కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలపనున్నారు.
-
47వ సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.
-
పలు సంస్థలకు భూమి కేటాయింపు అంశంపై ఆమోదం పొందే అవకాశం ఉంది.
-
“తల్లికి వందనం”, “అన్నదాత” వంటి సంక్షేమ కార్యక్రమాలపై చర్చ జరగనుంది.
-
ప్రధాని మోడీ సభ విజయవంతంపై CM చంద్రబాబు మంత్రులతో చర్చించనున్నారు.
-
భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలపై మంత్రులతో చర్చ జరగవచ్చు.
-
దేశ సరిహద్దులో యుద్ధ వాతావరణంపై సీఎం చంద్రబాబు చర్చించనున్నారు.
-
తీర ప్రాంత భద్రతపై ప్రత్యేక చర్చ జరగనుంది.
-
సంక్షేమ కార్యక్రమాలు, భద్రతా నిబంధనలు, భూమి కేటాయింపులపై నిర్ణయాలు తీసుకోబోతున్నారు.
