నెల్లూరు, 22 అక్టోబర్ (హి.స.)
, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా బుధవారం స్కూళ్లకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా సూచించారు. అలాగే కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భారీ వర్షాలు, వరదల కారణంగా.. ఎటువంటి సమస్యలు ఉత్పన్నమైనా కంట్రోల్ రూమ్‌లోని 0861- 2331261, 7995576699 నెంబర్లుకు కాల్ చేయాలని సూచించారు.
—————
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ
