హైదరాబాద్ 27 నవంబర్ (హి.స.) :ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్-అనకాపల్లి)మార్గంలో 34 ప్రత్యేకరైళ్లను నడుపుతున్నట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది. డిసెంబరు 4నుంచి వచ్చే ఏడాది మార్చి 26 వరకు సికింద్రాబాద్ నుంచి ప్రతి గురువారం సికింద్రాబాద్ నుంచి ప్రత్యేకరైలు(07055 నెంబర్) అనకాపల్లికి బయల్దేరనుంది. డిసెంబరు 5వ తేదీ నుంచి మార్చి 27 వరకు ప్రతీ శుక్రవారం అనకాపల్లి నుంచి ప్రత్యేక రైలు ( 07056 నెంబర్) నడుస్తాయని తెలిపారు.
—————
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ
