నంద్యాల, 28 డిసెంబర్ (హిం.స)
కల్వకుర్తి – నంద్యాల 167 కే జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోయిన భాదిత రైతులకు ప్రభుత్వం అందిస్తున్న నష్టపరిహారం బయటి మార్కెట్ ధరలో సగంకూడా రైతులకు అందడం లేదని, అధికారుల ఏకపక్ష ధోరణి వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని నంద్యాల మండలం పెద్ద కొట్టాల మాజీ సర్పంచ్ జయ పాపిరెడ్డి, బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ రోజు గురవారం నంద్యాల జిల్లా కలెక్టరేట్ ముందు వందలాదిమంది బాధిత రైతులు ధర్నా చేశారు.
హిందూస్తాన్ సమాచార్,సంధ్యా
