తెలంగాణ : హైదరాబాద్ : డిసెంబర్27( హింస)
గడిచిన 24 గంటల్లో తాజాగా రాష్ట్రంలో ఎనిమిది కొవిడ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ పేర్కొంది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి మొత్తం రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 8,44,566కి పెరిగింది. కొత్తగా నలుగురు కోలుకోగా.. ఇప్పటి వరకు 8,40,396 మంది వైరస్ నుంచి బయటపడ్డారు. ఇప్పటి వరకు మహమ్మారి బారినపడి 4,111 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 59 మంది కొవిడ్‌కు చికిత్స పొందుతున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇవాళ 1,333 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, మరో 30 మంది పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందని ఆరోగ్యశాఖ తెలిపింది.
పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార
