



అనంతపురం జిల్లా 17 జనవరి (హిం.స)తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి.. నేటి నుంచి తాడిపత్రి నియోజకవర్గంలో బస్సుయాత్ర చేపడుతున్నారు. యువ చైతన్య రథం పేరుతో 12 రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది. పెద్దవడుగూరు మండలం నుంచి ప్రారంభం కానున్న ఈ యాత్ర.. ప్రతిరోజు నాలుగు గ్రామాల్లో జరగనుంది. ఈ మేరకు యువ చైతన్య రథం బస్సు యాత్రకు జేసీ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. జేసీ నివాసం వద్ద నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సీబీ రోడ్డు మీదుగా ఆంజనేయ స్వామి దేవస్థానం వరకు ర్యాలీ నిర్వహించారు. ఆంజనేయ స్వామి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భారీ ర్యాలీతో యువ చైతన్య రథం బస్సు యాత్ర బయలుదేరింది.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
