అమరావతి, 10 అక్టోబర్ (హి.స.)ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్రప్రదేశ్ సీఎంగా నారా చంద్రబాబు నాయుడు చారిత్రక మైలురాయిని అధిగమించారు. సాధారణ కుటుంబంలో పుట్టి.. రాజకీయంగా సొంతకాళ్లపై ఎదిగి, ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు (అక్టోబర్ 10కి) పూర్తి చేసుకున్న వ్యక్తిగా నిలిచారు. దక్షిణాదిలో ఈ ఘనత సాధించిన రాజకీయ నాయకుల్లో మూడో వ్యక్తిగా ఉన్నారు. తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి, పుదుచ్చేరి సీఎం ఎన్. రంగస్వామి రికార్డును అందుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన ఘనత కూడా ఆయనకే దక్కింది.
1995 సెప్టెంబర్ 1న తొలిసారి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి రాష్ట్రానికి 8 సంవత్సరాల 255 రోజులు సీఎంగా సేవలు అందించారు. అలాగే నవ్యాంధ్రప్రదేశ్ సీఎంగా 6 సంవత్సరాల 110 రోజులు పూర్తిచేసుకుని.. మొత్తం 15 సంవత్సరాలపాటు సీఎంగా పనిచేసిన ఘనతను సాధించారు.
—————
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV
