అమరావతి, 21 ఆగస్టు (హి.స.)ప్రకాశం బ్యారేజి వద్ద కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్, ఔట్ ఫ్లో 5.04 లక్షల క్యూసెక్కులుగా ఉంది. గోదావరి, కృష్ణా, తుంగభద్ర నదీ పరివాహక, లంకగ్రామాల తట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. ఎగువన ఉన్న నాగార్జునసాగర్ జలాశయానికి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. దీంతో 26 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజె క్టుకు ఇన్‌ఫ్లో 3,92,997 క్యూసెక్కులు. ఔట్‌ఫ్లో 4,73,053 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ప్రస్తుత నీటిమట్టం 583 అడుగులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 312.04 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 291.66 టీఎంసీలుగా నమోదైంది. అటు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం మరింత పెరుగుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి వరద వచ్చి చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 4,98,022 క్యూసెక్కులు. జలాశయం నుంచి 5,13,540 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. భద్రాచలం వద్ద 50.3 అడుగుల నీటిమట్టం ఉంది. ధవళేశ్వరం వద్ద ఇన్,ఔట్ ఫ్లో 9.75 లక్షల క్యూసెక్కులుగా కొనసాగుతోంది
—————
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి
