కామారెడ్డి, 03 జనవరి (హి.స.)
కలెక్టరేట్ పరిసరాలను ఎప్పటికప్పుడు
పరిశుభ్రంగా ఉండేలా చూడాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ ప్రాంగణ పారిశుధ్యాన్ని శనివారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సందర్శకుల పార్కింగ్ స్థలం, ప్రధాన ద్వారం, ఉద్యానవనం తదితర ప్రాంతాలను పరిశీలించారు. పరిసరాల పరిశుభ్రత, చెత్త నిర్వహణ, పచ్చదనం సంరక్షణ పై అధికారులకు పలు సూచనలు చేశారు.
కలెక్టరేట్ ఆవరణ శుభ్రమైన వాతావరణం ఉండేలా రోజువారీ పారిశుద్ధ్య చర్యలు క్రమబద్ధంగా చేపట్టాలని, నిరంతర పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి పరిసరాలను ఆదర్శంగా నిలపాలని సూచించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు
