పుట్టపర్తి, 31 డిసెంబర్ (హిం.స)
భారత విద్యార్థి ఫెడరేషన్. ఎస్ఎఫ్ఐ ఫౌండేషన్ డే సందర్భంగా కొత్తచెరువు మండల కేంద్రంలో విశ్వ భారతి ఇంగ్లీష్ మీడియం కాలేజీలో స్వాతంత్రం ప్రజాస్వామ్యం సోషలిజం జెండా ఆవిష్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి నాగార్జున మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ 1970లో కేరళ రాష్ట్ర రాజధాని త్రివేండ్రంలో డిసెంబర్ 27నుండి 30 తేదీలలో అధ్యయనం, పోరాటం అనే నినాదంతో స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం అనే లక్ష్యాలతో ఏర్పడిందన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కారం దిశగా, లౌకిక, ప్రజాతంత్ర హక్కులను కాపాడుకునే దిశగా గత 55 ఏండ్ల పోరాటం కొనసాగిందన్నారు. ఉద్య మాల సందర్భంగా అనేక మంది విద్యార్థి నాయకులను కోల్పోయిందని నిరంజన్ తాలూక్దార్, అభిమన్యు, సుధీప్తో గుప్తో, లక్ష్మీనారాయణల త్యాగాలను గుర్తు చేశారు. విద్యారంగ సమస్యలపై దేశంలో వాటిని పరిష్కరించే దిశగా కృషి చేసిందన్నారు.
హిందూస్తాన్ సమాచార్,సంధ్యా
