అమరావతి, 10 అక్టోబర్ (హి.స.)
: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. అక్రమ మద్యం కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు.. అయితే, ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు.. ఆ తర్వాత తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.. కాగా, అక్రమ మద్యం కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి.. దీంతో, విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు.. ఏపీ ప్రభుత్వం తరఫున హాజరైన వాదనలు వినిపించారు ముకుల్ రోహత్గి, సిద్ధార్థ లూత్ర, సిద్ధార్థ అగర్వాల్.. వాదనల తర్వాత చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూనే ఏపీ సర్కార్‌కు నోటీసులు జారీ చేసి.. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు..
—————
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ
