ఢిల్లీ : జనవరి 20( హింస)అయోధ్యలో రామ మందిరంలో జరిగే ప్రాణ ప్రతిష్ఠ ఓ ముఖ్యమైన సందర్భం కానుందని భారత మాజీ క్రికెటర్, రాజ్యసభ ఎంపీ హర్భజన్ సింగ్ అన్నారు. ప్రజలంతా కార్యక్రమంలో పాల్గొని రాముడి ఆశీర్వాదం పొందాలని పిలుపునిచ్చారు. ఇది చారిత్రాత్మకమైన రోజని, శ్రీరాముడి అందరికీ ఆరాధ్యదైవమని.. ఆయన జన్మస్థలంలోనే ఆలయాన్ని నిర్మించడం విశేషమన్నారు. ఇందులో అందరూ భాగాస్వాములు కావాలన్నారు. తాను మతం, దేవుడిని అనుసరించేవాడనని.. దేవుడి కృప కోసం అవకాశం దొరికినప్పుడల్లా ఆలయాలు, గురుద్వారాలను సందర్శిస్తూ వస్తుంటానన్నారు.
పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార
