ఢిల్లీ : సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత, పార్లమెంట్ సభ్యుడు షఫికర్ రహ్మాన్ బర్క్(93) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. మొర్దాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆస్పతరిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రస్తుత పార్లమెంట్‌లో అత్యంత వృద్ధ ఎంపీగా ఉన్న రహ్మాన్.. యూపీలోని సంభల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
