ఢిల్లీ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ హర్యానా రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ మంగళవారం ఊహించని విధంగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు.
