ఢిల్లీ లిక్కర్ కేసు కీలక మలుపు తిరిగింది. ఎమ్మెల్సీ కవితను నిందితురాలిగా సీబీఐ చేర్చింది. ఈ మేరకు కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26న విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో పాటు కవితను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని సీబీఐ వర్గాలు అంటున్నాయి.
ఇదే కేసుల ఇప్పటికే కవితను మూడుసార్లు సీబీఐ ప్రశ్నించింది. 2022లో ఇదే కేసులో సీబీఐ ప్రశ్నించింది. లిక్కర్ కేసులో నిందితురాలిగా సెక్షన్ 41ఏ కింద నోటీసులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన నోటీసులను సవరిస్తూ తాజాగా మరోసారి సీబీఐ నోటీసులిచ్చింది. దర్యాప్తు తర్వాత కవితను నిందితురాలిగా సీబీఐ పేర్కొంది.
ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. న్యాయమూర్తి ముందు కవిత పీఏ అశోక్ కౌశిక్ సంచలన విషయాలు బయటపెట్టినట్లు సమాచారం. లిక్కర్ కేసులో పలువురికి ముడుపులు అందజేసినట్లు జడ్జి ముందు కౌశిక్ స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు తెలిసింది. కవితతో పాటు కౌశిక్‌ని కూడా నిందితుడిగా సీబీఐ పరిగణిస్తోంది.
