ఢిల్లీ బెంగళూరు రామేశ్వరం కేఫ్ బాస్ట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. కేసులో ప్రధాన నిందితుడిని కలిసి వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అదుపులోకి తీసుకున్నది. పేలుడు ఘటనపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేసిన ఎన్‌ఐఏ.. బళ్లారి పేలుడు ఘటనలో ప్రధాన నిందితుడితో సంబంధం ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో కర్ణాటకలోని బళ్లారి జిల్లాకు చెందిన సయ్యద్ షబ్బీర్ అనే అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. రామేశ్వరం కేఫ్ పేలుడులో ప్రధాన నిందితుడు పారిపోయిన మార్గంలోని సీసీటీవీ ఫుటేజీలను విశ్లేషించినట్లు కర్ణాటక పోలీసు వర్గాలు తెలిపాయి.
